logo
Published : 01/12/2021 06:09 IST

విజయనగరి తలపున సిరివెన్నెల


దర్శకుడు క్రిష్‌కి పురస్కారం అందజేసే కార్యక్రమంలో..

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్య దిగ్గజం.. సినిమా పాటకు సొబగులు అద్ది సుస్థిర సుగంధాన్ని అందించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈయన మరణ వార్త విని కళలకు కాణాచి అయిన విజయనగరం, ఇక్కడి ప్రజలు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు ఈ గడ్డతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సిరివెన్నెల 2018 నవంబరు 30న గురజాడ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు గురజాడ సాంస్కృతిక సమాఖ్య దర్శకుడు క్రిష్‌కి ‘గురజాడ పురస్కారం’ ప్రదానం చేశారు. ఆ కార్యక్రమానికి సీతారామశాస్త్రి ప్రధాన వక్తగా హాజరయ్యారు. ముందుగా వేంకట అప్పారావు స్వగృహాన్ని సందర్శించి, ఆయన వాడిన వస్తువులను తిలకించారు.

 2017లో విజయనగరంలోని ఎస్‌ కన్వెన్షన్‌లో జరిగిన రోటరీ క్లబ్‌ 60 వసంతాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 శాస్త్రి తన కుమార్తె వివాహానికి విజయనగరంలో బాగా పరిచయం ఉన్న పి.వి.నర్సింహరాజు, ఉసిరికల చంద్రశేఖర్‌, కాపుగంటి ప్రకాష్‌, మందాని అశోక్‌, గంటి మురళీలను స్వయంగా ఆహ్వానించడం ఆయన నిరాడంబర వ్యక్తిత్వానికి మచ్చుతునక. ప్రకాష్‌ ఇంట వారి కుటుంబ సభ్యులతో భోజనం చేశారు.

 విజయనగరంలో ఆత్రేయ స్మారక కళాపీఠం ఆత్రేయ పురస్కారంతో సిరివెన్నెలను సత్కరించింది.

2017లో చిత్రకారిణి ప్రవల్లిక నారాయణ్‌ గీసిన విజయనగరం చరిత్ర చిత్రపటాన్ని పూసపాటి అశోక్‌గజపతిరాజు సమక్షంలో సీతారామశాస్త్రికి అందజేసింది.

విజయనగరానికి చెందిన రచయిత గురుప్రసాద్‌ కె.విశ్వనాథ్‌ జీవిత విశేషాలపై రాసిన కళాతపస్వి అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించగా.. సిరివెన్నెల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి వొెలిగిస్తున్న సిరివొెన్నెల

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని