logo
Published : 01/12/2021 06:09 IST

మన జిల్లా నిరుపేద

రాష్ట్రంలో 12వ స్థానం

వెల్లడించిన నీతి ఆయోగ్‌

ఈనాడు-విజయనగరం: నీతి ఆయోగ్‌.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ఆధారంగా రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇందులో జిల్లాలో ఇప్పటికీ పేదరికం అనుభవిస్తున్న వారు 19 శాతం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది.

వైద్య సదుపాయాలు చాలావరకు మెరుగుపడినా శిశు, కౌమార మరణాలు ఆగడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరముందని నివేదిక సూచించింది.

శిశు, కౌమార మరణాలు 1.67 శాతం ఉండగా.. పట్టణాల్లో 0.81, గ్రామాల్లో 1.35 శాతం నమోదవుతున్నాయి.

గర్భిణులు, బాలింతల్లో 9.98 శాతం మంది వివిధ సమస్యలతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో పట్టణాల్లో 4.86, గ్రామాల్లో 8,68 శాతంగా ఉన్నారు.

 గ్రామాలు 18.49 %

పట్టణాలు 19.39 %

అంగన్‌వాడీల్లో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం వంటివి అమలు చేస్తున్నా జిల్లాలో 35.38 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా ఇందుకు కారణమట.

చదువుకు స్వస్తి

ఇప్పటికీ చాలామంది చదువుకు అర్ధాంతరంగా స్వస్తి చెబుతున్నారు. ఒక కుటుంబంలో పదేళ్లు, అంతకుమించి వయసున్న వారిలో కనీసం ఒక్కరూ ఆరేళ్ల పాఠశాల విద్య పూర్తి చేయనివారు 19.64 శాతం ఉండగా.. పట్టణాల్లో 1.30, గ్రామాల్లో 13 శాతం మంది ఉన్నారు.

ఇంకా లేదు గృహయోగం

ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా ఇంకా నిలువ నీడ లేని వారు ఉన్నారు. జిల్లాలో పక్కా ఇల్లు లేని కుటుంబాలు 17.16 శాతం కాగా.. పట్టణాల్లో 2.75, గ్రామాల్లో 11.21 శాతం మంది ఉన్నారు. 1983 నుంచి 2011 వరకు వివిధ పథకాల్లో 2,98,611 మంది ఇళ్లు కట్టుకోగా.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో 8793 మంది నిర్మించుకున్నారు. వీటితో పాటు టిడ్కో ఆధ్వర్యంలో 8048 గృహాల నిర్మాణం చేపట్టారు. జగనన్న కాలనీల్లో 98,286 మందికి మంజూరు చేశారు. ఇవన్నీ పూర్తయితే చాలామందికి సొంతింటి కల నెరవేరుతుంది.

పారిశుద్ధ్యంలో అట్టడుగు

పారిశుద్ధ్యం విషయంలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. మెరుగైన మురుగు సౌకర్యం లేని కుటుంబాలు, ఉన్నా ఇతరులతో కలిసి వాడుకుంటున్న వారు పట్టణాల్లో 24.85, గ్రామాల్లో 21.68 శాతం మంది ఉన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా గతంలో జిల్లాలో 3,23,910 మరుగుదొడ్లు నిర్మించారు. చాలామందికి అవగాహన లేక వీటిని వినియోగించడం లేదు.

కట్టెల పొయ్యే దిక్కు

జిల్లాలో వంటకు ఇప్పటికీ కట్టెలు, బొగ్గు, వ్యవసాయ వ్యర్థాలు, పేడను వినియోగిస్తున్న కుటుంబాలు పట్టణాల్లో 5.78 శాతం, గ్రామాల్లో 21.66 శాతం ఉన్నాయి. గతంలో కేంద్రం ఉజ్వల పథకంలో జిల్లాలో 33,473 కనెక్షన్లు అందించింది. గ్యాస్‌ ధర పెరిగిపోవడం, ఏజెన్సీలోని కొండలపై గ్రామాలకు సిలిండర్లు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండటం.. ఇలా అనేక కారణాలతో వంట ఇంధనంగా కట్టెలు ఇతర సామగ్రి వాడుతున్నారు.

తెరవని ఖాతా

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు లేని కుటుంబాలు 5.01 శాతం ఉన్నాయి. ఈ విషయంలో గ్రామీణుల కంటే పట్టణవాసులే వెనుకబడి ఉన్నారు. గ్రామాల్లో 2.93 మందికి, పట్టణాల్లో 7.38 మందికి లేవు. గతంలో కేంద్రం జన్‌ధన్‌ పేరుతో 6,58,273 మందితో శూన్యనిల్వ ఖాతాలు తెరిపించింది. అయినా ఇంకా చాలా మంది మిగిలిపోయారు.

రక్షిత మంచి నీరు లేని కుటుంబాలు 20.73, విద్యుత్తు లేనివి 1.13 శాతం ఉన్నాయి.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని