logo

కొనసాగుతున్న రైళ్ల రద్దు

న్యూస్‌టుడే: జవాద్‌ తుపాను ప్రభావంతో ఈ నెల 5, 6, 7, 8, 9వ తేదీల వరకు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 5న విశాఖపట్నం, హావ్‌డా, భువనేశ్వర్‌, పూరీ, పలాస, కిరండూల్‌, షాలిమార్‌, చెన్నై

Published : 05 Dec 2021 05:17 IST

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: జవాద్‌ తుపాను ప్రభావంతో ఈ నెల 5, 6, 7, 8, 9వ తేదీల వరకు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 5న విశాఖపట్నం, హావ్‌డా, భువనేశ్వర్‌, పూరీ, పలాస, కిరండూల్‌, షాలిమార్‌, చెన్నై సెంట్రల్‌, మైసూర్‌, తిరుపతి, గుణుపూర్‌, రాయపూర్‌ ప్రాంతాల నుంచి బయలు దేరాల్సిన 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 6న గుణుపూర్‌-పూరీ, జగదల్‌పూర్‌-రవుర్కెలా, మైసూర్‌-హావ్‌డా, హజ్రత్‌ నిజాముద్దీన్‌-విశాఖ(12808), 7న బెంగళూర్‌ కంటోన్మెంట్‌-హటియా(18638), అగర్తలా-బెంగళూర్‌(02984), 8న కామాఖ్య-యశ్వంత్‌పూర్‌(12552), ఒఖా-పూరీ(20820), 9న గువాహటి-సికింద్రాబాద్‌(12514) రైళ్లు రద్దయ్యాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని