logo
Published : 05/12/2021 05:17 IST

ఎలా.. నీరు-చెట్టు పనుల పరిశీలన

మూడు నెలల్లో నివేదిక సమర్పించాలి


రామభద్రపురం మండలంలో ఏడొంపుల గెడ్డ పరిధిలో నిర్మించిన చప్టా

బొబ్బిలి, న్యూస్‌టుడే: తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నీరు-చెట్టు పథకంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనుల్లో కొంత మేర అక్రమాలు జరిగాయని విమర్శలు రావడంతో ముందస్తుగా దర్యాప్తు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో పరిశీలనకు ఈఈ, డీఈఈ, ఏఈలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సభ్యులు మూడు నెలల్లో పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం కాలువలు, చెరువుల్లో నిండుగా నీరు ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

34 మండలాలు.. 12 బృందాలు: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పనుల పరిశీలనకు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఉప కార్యనిర్వాహక ఇంజినీరు బృంద నాయకుడిగా వ్యవహరిస్తారు. వీటిలో పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, సర్వశిక్ష అభియాన్‌ శాఖలకు చెందిన ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. కార్యనిర్వాహక ఇంజినీర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. బొబ్బిలి సర్కిల్‌ ఎస్‌ఈని నోడల్‌ అధికారిగా నియమించారు. ఆయన పర్యవేక్షణలోనే సాంకేతిక అనుమతులు, చేసిన పని, చెల్లించిన బిల్లు, ఇవ్వాల్సిన మొత్తాలు మొదలైన వాటిపై పరిశీలిస్తారు.

సమస్యంతా అక్కడే: ప్రస్తుతం అన్ని చెరువుల్లో నీరు ఉండటంతో క్షేత్రస్థాయి పరిశీలన సమస్యగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల చప్టాలు కొట్టుకుపోగా రైతులు శ్రమదానం చేసి బాగు చేసుకున్నారు. పనులు చేపట్టి మూడేళ్లయిన నేపథ్యంలో ఆనవాళ్లు మారిపోయాయి. ఈ నేపథ్యంలో సభ్యులెలా ముందుకు వెళ్లనున్నారో చూడాలి. ప్రత్యేక బృందాలతో పాటు విజిలెన్స్‌ అధికారులు పరిశీలిస్తారని నోడల్‌ అధికారి ఎన్‌.రాంబాబు తెలిపారు.

జిల్లాలో వివరాలు

l చేపట్టిన పనులు: 603

l విలువ: రూ.40.02 కోట్లు

l చెల్లించాల్సిన బిల్లులు:

రూ.33.28 కోట్లు

l ఇవి చేశారు: కాలువల్లో పూడిక తీత, సైఫాన్లు, తూముల నిర్మాణం, మట్టికట్టల ఎత్తు పెంపు, సాధారణ, గొలుసుకట్ట చెరువుల అభివృద్ధి, ఆనకట్టల పరిధిలో కాలువల నిర్మాణం.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని