Published : 05 Dec 2021 05:17 IST
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
క్రీడాకారులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు
రామభద్రపురం, న్యూస్‌టుడే: మండలంలోని ఆరికతోట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన సి.హెచ్.శ్యామ్‌కుమార్, కె.భాగ్యలక్ష్మి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్‌రావు, పీడీ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 10 నుంచి గుజరాత్‌లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పీడీ తెలిపారు.
Tags :