logo

ఎన్నాళ్లీ నిరీక్షణ

సాలూరు పట్టణ ప్రత్యామ్నాయ దారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది నుంచి జరుగుతున్నా ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే మార్చిలో రహదారి ప్రారంభించాల్సి ఉన్నా బిల్లుల చెల్లింపు, పనుల్లో జాప్యంతో అడుగులు ముందుకు పడలేదు.

Published : 17 Jan 2022 05:58 IST


ఏడాదిగా సాగుతున్న ప్రత్యామ్నాయ రహదారి పనులు

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణ ప్రత్యామ్నాయ దారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది నుంచి జరుగుతున్నా ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే మార్చిలో రహదారి ప్రారంభించాల్సి ఉన్నా బిల్లుల చెల్లింపు, పనుల్లో జాప్యంతో అడుగులు ముందుకు పడలేదు. కొట్టక్కి వంతెన సమీపం నుంచి జీగిరాం జూట్‌ మిల్లు వరకు 6.2 కిలోమీటర్ల పొడవున పనులు చేయాల్సి ఉండగా దుగ్థసాగరం రోడ్డు కూడలి వరకు సేకరించిన భూమికి పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు, భూ యజమానులు ఆందోళనలు చేస్తున్నారు. గతంలోనూ రెండు సార్లు యంత్రాలను అడ్డగించారు. మార్కెట్‌ విలువ కాకుండా ప్రభుత్వ విలువతో పరిహారం లెక్కించడం, శాశ్వత భవనాలు, టేకు చెట్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వ్యతిరేకిస్తున్నారు.

పరిశీలన.. ప్రతిపాదనలు.. ప్రత్యామ్నాయ రహదారికి భూములిచ్చిన రైతులు, భవనాలు కోల్పోతున్న వ్యాపారులు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన ప్రతిసారీ అధికారులు వస్తున్నారు. పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశిస్తున్నారు తప్ప పరిష్కారం చూపడం లేదు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నేటికీ మోక్షం చూపించలేదు. మార్చి నాటికి పనులు చేయలేమని, జులై నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఎన్‌హెచ్‌26 డీఈ నర్సింగరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని