logo

తాటిపూడిలో 250 క్యూసెక్కుల నీరు విడుదల

తాటిపూడి జలాశయంలో 297 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో మూడుసార్లు గరిష్ఠ స్థాయి నమోదు కావడం గమనార్హం. నాలుగు రోజులుగా అరకు, అనంతగిరి కొండల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి

Published : 17 Jan 2022 05:58 IST


ప్రాజెక్టు నుంచి పారుతున్న నీరు

గంట్యాడ, న్యూస్‌టుడే: తాటిపూడి జలాశయంలో 297 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో మూడుసార్లు గరిష్ఠ స్థాయి నమోదు కావడం గమనార్హం. నాలుగు రోజులుగా అరకు, అనంతగిరి కొండల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం స్పిల్‌వే గేట్లు ఎత్తి గోస్తనీలోకి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదీపరివాహక ప్రాంతాల వారిని అప్రమత్తం చేశామని ఏఈ అపర్ణ తెలిపారు. ఆదివారం వరద ఉద్ధృతి కాస్త తగ్గిందని, దీన్నిబట్టి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు భవిష్యత్తులో తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా నీటినిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని