logo

13,590 సంఘాలకు రూ.334.44 కోట్లు

కొవిడ్‌ కారణంగా లక్ష్యంతో సంబంధం లేకుండా స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. 2020-21 ఏడాదిలో లింకేజీని అందుకోలేని సంఘాలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు వీవోఏ లాగిన్‌ ద్వారా మంజూరు చేస్తారు.

Published : 17 Jan 2022 05:58 IST

 మహిళలకు డబ్బే...డబ్బు...
 లక్ష్యంతో సంబంధం లేకుండా లింకేజీ రుణాలు


రుణాలపై అవగాహన కల్పిస్తున్న వెలుగు సిబ్బంది

మయూరి కూడలి, న్యూస్‌టుడే: కొవిడ్‌ కారణంగా లక్ష్యంతో సంబంధం లేకుండా స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. 2020-21 ఏడాదిలో లింకేజీని అందుకోలేని సంఘాలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు వీవోఏ లాగిన్‌ ద్వారా మంజూరు చేస్తారు. 13590 సంఘాల్లోని 15000 మంది సభ్యులకు రూ.334.44 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 
ఇప్పటివరకు పొందిన వారు కూడా...: లింకేజీ ద్వారా గతంలో పొందిన వారు, ఇప్పటికి వచ్చిన వారు కూడా మళ్లీ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం సీసీఎల్‌ (క్యాష్‌ క్రెడిట్‌ రుణం) విధానంలో తీసుకున్న రుణంలో 75 శాతం సంఘం చెల్లించి ఉంటే మళ్లీ తీసుకోవచ్చు. రూ. 3 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం కింద వందశాతం రాయితీ కూడా ఇస్తారు. 

నెలకు రూ.111.48 కోట్లు:  మూడు నెలల సగటు ప్రాతిపదికన ప్రతి మాసానికి రూ.111.48 కోట్లను 4,530 సంఘాలకు ఇస్తారు. వీవోఏ లింకేజీ యాప్‌ ద్వారా సంఘ సభ్యుల తీర్మానంతో మంజూరు చేస్తారు. ఒక్కో సంఘానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 11 శాతం వడ్డీకి అందజేస్తారు. వాటికి ఎటువంటి బీమా సౌకర్యం ఉండదు.

ఈ ఆర్థిక ఏడాదిలో...: గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రతి నెలా సంఘాలకు రూ.72.22 కోట్లు మంజూరు చేసేవారు. ఇలా గడిచిన తొమ్మిది నెలల్లో 15,848 సంఘాలకు రూ.650.91 కోట్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 29,420 సంఘాలకు గానూ రూ.984.62 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఆర్థికంగా ఎదగాలన్న ఆశయంతో...: 
మహిళలు రుణాలు తీసుకుని జీవనోపాధులు మెరుగుపర్చుకోవాలి. వెలుగు సిబ్బంది ఎక్కడైనా చేతివాటం ప్రదర్శిస్తే ఫిర్యాదు చేయాలి. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనక్కర్లేదు. 
-ఎం.అశోక్‌కుమార్, ఇన్‌ఛార్జి పథక సంచాలకుడు, డీఆర్‌డీఏ. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని