logo

నేడు టెలీ స్పందన

ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమాల్ని నేడు రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తెలిపారు. నేరుగా ప్రజల నుంచి అర్జీలు తీసుకోనప్పటికీ

Published : 17 Jan 2022 05:58 IST

కొవిడ్‌ కారణంగా ‘స్పందన’ రద్దు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమాల్ని నేడు రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తెలిపారు. నేరుగా ప్రజల నుంచి అర్జీలు తీసుకోనప్పటికీ.. ఫోన్‌ ద్వారా వినతులు స్వీకరిస్తారని వారు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ఉపకలెక్టర్‌ బి.పద్మావతి నేతృత్వంలో కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ఫోన్‌ 08922-276713 నంబరు ద్వారా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ః పోలీసు కార్యాలయంలో 08922-276163 నంబరుకు ఫిర్యాదులు ఫోన్‌ ద్వారా చెప్పేందుకు అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. కలెక్టర్, ఎస్పీ గ్రీవెన్స్‌లకు సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట  వరకు ఆయా నెంబర్లకు ఫోన్‌ చేసి సమస్యలను వివరించవచ్చునని వారు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని