logo

కాలనీ లేఅవుట్‌లో అన్నీ అవస్థలే..

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం వేసేిన జగనన్న కాలనీ లేఅవుట్లల్లో సౌకర్యాలు కొరవడ్డాయి. లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండపల్లి మండలంలోని దేవుపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌లో 75 ఇళ్లస్థలాలను గ్రహపతి అగ్రహారం పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు ఇచ్చారు.

Published : 18 Jan 2022 05:35 IST

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం వేసేిన జగనన్న కాలనీ లేఅవుట్లల్లో సౌకర్యాలు కొరవడ్డాయి. లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండపల్లి మండలంలోని దేవుపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌లో 75 ఇళ్లస్థలాలను గ్రహపతి అగ్రహారం పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు ఇచ్చారు. ఇటీవల వర్షాలకు నీరు నిలిచిపోవడం, బురదగా మారడంతో ఇళ్లనిర్మాణ పనులకు అవస్థలు పడాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. రహదారులు, కాలువలు వంటి సదుపాయాలు లేక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో త్రివిక్రమరావు వద్ద ప్రస్తావించగా నిబంధనలు ప్రకారం లేఅవుట్లను అభివృద్ధి చేశామన్నారు. త్వరలో అన్ని చోట్ల సిమెంట్‌ రహదారులు, తాగునీటి, విద్యుత్తు సదుపాయాలను కల్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.-న్యూస్‌టుడే, బొండపల్లి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని