logo

స్వచ్ఛంద రక్తదానానికి అపూర్వ స్పందన

జరజాపుపేట ప్రాథమిక పాఠశాలలో 1999-2000లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం ఒకచోట కలుసుకున్నారు. ఆత్మీయ సమావేశం అనంతరం పాఠశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మిత్రమా సంక్షేమ సంఘాన్ని స్థాపించారు.

Published : 18 Jan 2022 05:35 IST


జరజాపుపేటలో రక్తదానం చేస్తున్న దాతలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: జరజాపుపేట ప్రాథమిక పాఠశాలలో 1999-2000లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం ఒకచోట కలుసుకున్నారు. ఆత్మీయ సమావేశం అనంతరం పాఠశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మిత్రమా సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. దీనికి అధ్యక్షుడిగా మద్దిల త్రినాథ్‌, ఉపాధ్యక్షురాలిగా కనకల త్రివేణి, ప్రధాన కార్యదర్శిగా కంటుబోతు గౌరి, కోశాధికారిగా కొత్తల శంకర్రావు, సంయుక్త కార్యదర్శిగా మద్దిల పైడిపునాయుడులను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌వీఎన్‌ బ్లడ్‌ బ్యాంకు ఇంఛార్జి నాగేశ్వరరావు, వైద్యుడు కృష్ణత్‌, సాధన యువజన సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, వెంకటరమణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని