logo

సిలికో మాంగనీస్‌ స్వాధీనం

మండలంలోని గుమడ దాబా సమీపంలోని ఖాళీ స్థలంలో సిలికో మాంగనీస్‌ నిల్వలపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి ఐదు టన్నుల సిలికో మాంగనీస్‌, రెండు టన్నుల నల్ల బొగ్గును గుర్తించామని ఎస్సై

Published : 18 Jan 2022 05:35 IST


పోలీసులు గుర్తించిన నిల్వలు

కొమరాడ, న్యూస్‌టుడే: మండలంలోని గుమడ దాబా సమీపంలోని ఖాళీ స్థలంలో సిలికో మాంగనీస్‌ నిల్వలపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి ఐదు టన్నుల సిలికో మాంగనీస్‌, రెండు టన్నుల నల్ల బొగ్గును గుర్తించామని ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, వారిని న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. సిలికో మాంగనీస్‌ లారీల ద్వారా విశాఖపట్నం, కాకినాడ పోర్టు నుంచి రాయ్‌పూర్‌కు, అదేవిధంగా రాయపూర్‌ నుంచి విశాఖకు బొగ్గు రవాణా అవుతుంటాయని, వ్యాపారాలు వాహన చోదకుల నుంచి ఖనిజాన్ని కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ ఉంచుతున్నట్లు తెలిసిందన్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని