logo

పేదలందరికీ సంక్షేమ ఫలాలు: బొత్స

పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ డెయిరీ ఆర్థిక సహకారంతో నగరంలోని ప్రేమ సమాజం వృద్ధాశ్రమంలో రూ.68 లక్షలతో నిర్మించిన వసతి సముదాయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

Published : 18 Jan 2022 05:35 IST


విజయనగరంలో వసతిసముదాయాన్ని ప్రారంభిస్తున్న
మంత్రి సత్యనారాయణ, చిత్రంలో ఎంపీ బెల్లాన, జడ్పీ ఛైర్మన్‌

మెరకముడిదాం, విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ డెయిరీ ఆర్థిక సహకారంతో నగరంలోని ప్రేమ సమాజం వృద్ధాశ్రమంలో రూ.68 లక్షలతో నిర్మించిన వసతి సముదాయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అలాగే మెరకముడిదాం మండలంలోని సోమలింగాపురంలో రూ.కోటితో కల్యాణమండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నిర్మించిన కొత్త రైస్‌మిల్లును ప్రారంభించారు. అనంతరం యంత్రసేవా పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలగట్ల, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, విశాఖ డెయిరీ ట్రస్టు ఛైర్మన్‌ తులసీరావు, మేయరు విజయలక్ష్మి, జేసీ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని