logo

స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం: కలెక్టర్‌

కరోనా నియంత్రణకు అన్ని రంగాలవారు సహకరించాలని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారం అవసరమని కలెక్టర్‌ సూర్యకుమారి పేర్కొన్నారు. యువజన అధికారి విక్రమాదిత్య ఆధ్వర్యంలో జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల

Published : 18 Jan 2022 05:35 IST

వైద్యవిభాగం, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణకు అన్ని రంగాలవారు సహకరించాలని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారం అవసరమని కలెక్టర్‌ సూర్యకుమారి పేర్కొన్నారు. యువజన అధికారి విక్రమాదిత్య ఆధ్వర్యంలో జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులతో సోమవారం జరిగిన జూమ్‌ కాన్ఫెరెన్స్‌లో ఆమె మాట్లాడారు. బస్సు స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కార్యాలయాలు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు. విశాఖకు సమీపంలో ఉండే మండలాల్లో పాజిటివ్‌ కేసులు పెరిగాయని, ఆయా ప్రాంతాల్లో వైరస్‌ను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అంతా కలిసి రావాలన్నారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో కరోనా రోగులతో వచ్చే వారికి ఆహారం అందించడానికి సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు ఆర్‌.మహేష్‌కుమార్‌, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు