logo

28 నుంచి కొండడాబాలులో నవదిన ప్రార్థనలు

రోమన్‌ కేథలిక్‌ల ఆరాధ్య కేంద్రమైన కొత్తవలస మండలం కొండడాబాలులోని వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో ఈనెల 28 నుంచి నవదిన ప్రార్థనలు నిర్వహించనున్నారు. విశాఖ అతిమేత్రాసనం పరిధిలోని ఈ క్షేత్రంలో ప్రతి ఏటా ఫిబ్రవరి మొదటి ఆదివారం యాత్రా మహోత్సవం

Published : 18 Jan 2022 05:35 IST


వ్యాకులమాత పుణ్యక్షేత్రం

కొత్తవలస, న్యూస్‌టుడే: రోమన్‌ కేథలిక్‌ల ఆరాధ్య కేంద్రమైన కొత్తవలస మండలం కొండడాబాలులోని వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో ఈనెల 28 నుంచి నవదిన ప్రార్థనలు నిర్వహించనున్నారు. విశాఖ అతిమేత్రాసనం పరిధిలోని ఈ క్షేత్రంలో ప్రతి ఏటా ఫిబ్రవరి మొదటి ఆదివారం యాత్రా మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 5 వరకు ప్రత్యేక పూజా ప్రార్థనలు కొనసాగిస్తారు. రోజుకో విచారణ తరపున జపమాల నిర్వహించి, ప్రత్యేక అంశంపై ధ్యానిస్తారు. ఫిబ్రవరి 5న విశాఖ నుంచి కొండడాబాలుకి పాప పశ్చాత్తాప మహా పాదయాత్రగా కథోలిక్‌ విశ్వాసకులు తరలివస్తారు. ఆ రోజున విశాఖ అతిమేత్రాణులు మల్లవరపు ప్రకాష్‌ ఫోంటిఫికల్‌ దివ్య పూజాబలి నిర్వహిస్తారు. కొండడాబాలులో ఉత్సవాల నిర్వహణకు విచారణకర్త గొంగాడ రాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని