logo

టెలీ స్పందనకు వినతులు

కలెక్టర్‌ సూర్యకుమారి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టెలీ స్పందనకు 33 వినతులు వచ్చాయి. కొవిడ్‌ నేపథ్యంలో స్పందనను తాత్కాలికంగా రద్దు చేశామని, చరవాణి ద్వారా ప్రజలతో మాట్లాడతానని చెప్పారు. భూ సంబంధిత, పింఛన్లు, గృహాలు, సదరం ధ్రువపత్రాలు,

Published : 18 Jan 2022 05:35 IST


ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

రింగురోడ్డు, నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: కలెక్టర్‌ సూర్యకుమారి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టెలీ స్పందనకు 33 వినతులు వచ్చాయి. కొవిడ్‌ నేపథ్యంలో స్పందనను తాత్కాలికంగా రద్దు చేశామని, చరవాణి ద్వారా ప్రజలతో మాట్లాడతానని చెప్పారు. భూ సంబంధిత, పింఛన్లు, గృహాలు, సదరం ధ్రువపత్రాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందగా, ఆయా విభాగాల అధికారులకు వాటిని తెలియజేశామన్నారు. డీఆర్వో గణపతిరావు, డీపీఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ః  ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తన కార్యాలయం నుంచి టెలీ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 08922-276163 నెంబరు ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆయా స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని