logo

నేడు గురువుల కలెక్టరేట్‌ ముట్టడి

పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన రెండోరోజూ కొనసాగింది. గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. తరగతులకు ఇబ్బంది కలిగించకుండా 50శాతం మంది విధులకు

Published : 20 Jan 2022 05:10 IST

50 శాతమే విధులకు హాజరు

మిగిలిన వారంతా ఉద్యమంలోనే..

బొండపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుల నిరసన

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన రెండోరోజూ కొనసాగింది. గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. తరగతులకు ఇబ్బంది కలిగించకుండా 50శాతం మంది విధులకు హాజరయ్యేందుకు, మిగిలిన వారంతా సెలవులు పెట్టి ఉద్యమంలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. సుమారు నాలుగువేల మంది పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకే  కలెక్టరేట్‌కు చేరుకోవాలని సంఘాల నాయకత్వాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. కలెక్టరేట్‌ లోపలికి విధులకు ఉద్యోగులు వెళ్లకుండా  అడ్డుకోనున్నట్లు, అరెస్టులకు బెదరకుండా ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చాటి చెప్పనున్నట్లు తెలిపారు.

ఉద్యోగ సంఘాల మద్దతు: ఉపాధ్యాయుల పోరాటానికి ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో మద్దతు తెలిపాయి. తొలుత ఏపీసీపీఎస్‌ఈఏ, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలే మద్దతు ప్రకటించాయి. మంగళవారం అమరావతిలో చర్చల అనంతరం ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంఘాలతో పాటు వైద్య, ఆర్టీసీ, పింఛనుదార్లు తదితర జిల్లాలో సుమారు వంద ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతిచ్చినట్లు ఫ్యాప్టో నాయకులు చెబుతున్నారు.

ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి: ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. యూటీఎఫ్, ప్రధానోపాధ్యాయ, ఏపీటీఎఫ్‌ 1938, ఏపీటీఎఫ్‌ 257, ఎస్టీయూ, ఎస్సీ ఎస్టీ, బీటీఏ, ఆప్టా, ఆదివాసీ ఉపాధ్యాయ తొమ్మిది సంఘాలున్నాయి. ఇవే కాకుండా ఫ్యాప్టోలో లేని పీఆర్టీయూ, ఆపస్, ఎస్సీ, ఎస్టీ(రెండోది), పీఈటీ, ఆర్‌యూపీపీ తదితర సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు  తెలియజేసినట్లు ఫ్యాప్టో ఛైర్మన్‌ టి.సన్యాసిరాజు, కో-ఛైర్మన్‌ జేఏవీఆర్‌కే ఈశ్వరరావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు