logo

త్వరితగతిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు

జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా

Published : 20 Jan 2022 05:10 IST

సమీక్షిస్తున్న ఛైర్మన్‌ శ్రీనివాసరావు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సాలూరు, వేపాడ, మక్కువ, గుర్ల, మెరకముడిదాం, పార్వతీపురం మండలాల్లో తాగునీటి సమస్యలపై తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కె.శివానందకుమార్‌, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు, ఉప సీఈవో కె.రామచంద్రరావు, డీఈఈలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని