logo

కొవిడ్‌ నిబంధనలతో శంబర జాతర

ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగే శంబర జాతరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిషేధిస్తున్నామని ఓఎస్డీ సూర్య చంద్రరావు, సీఐ ఎల్‌.అప్పలనాయుడు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. కొవిడ్‌ మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తులు

Published : 20 Jan 2022 05:10 IST

పోలీసులకు సూచనలిస్తున్న ఓఎస్‌డీ

సాలూరు, మక్కువ, న్యూస్‌టుడే: ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగే శంబర జాతరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిషేధిస్తున్నామని ఓఎస్డీ సూర్య చంద్రరావు, సీఐ ఎల్‌.అప్పలనాయుడు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. కొవిడ్‌ మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తులు గుమిగూడకూడదని ఆంక్షలు విధిస్తున్నామన్నారు. సాలూరు వైపు వచ్చే వాహనాలను మామిడిపల్లి వద్ద, బొబ్బిలి నుంచి వచ్చే వాటిని పాత బొబ్బిలి వద్ద, పార్వతీపురం నుంచి వచ్చే వాటిని చినభోగిలి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిలిపేస్తామన్నారు. కవిరిపల్లి, ఎస్‌.పెద్దవలస, మావుడి, చెముడు తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్విచక్రవాహనాలు, కార్లను అనుమతిస్తామని, రెగ్యులర్‌గా శంబరకు తిరిగే బస్సులు యథావిధిగా తిరుగుతాయన్నారు.

బందోబస్తు: శంబర జాతరకు అయిదుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 550 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలతో తొలేళ్లు, సిరిమానోత్సవం, అంపకోత్సవానికి బందోబస్తు చేపడతామన్నారు. మొదటి వారమే కాకుండా పదివారాల పాటు జరిగే జాతరలో పోలమాంబను ఎప్పుడైనా దర్శించుకోవచ్చన్నారు. నిబంధనలు పాటించని వారిని జాతరకు అనుమతించబోమని చెప్పారు. శంబరలోని జాతర ఏర్పాట్లలో భాగంగా క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలాలు, సిరిమాను తిరిగే వీధులను ఓఎస్డీ పరిశీలించారు. ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పూడి దాలినాయుడు, ఈవో బీఎల్‌ నగేష్‌, ఉప సర్పంచి అల్లు వెంకటరమణ, గెంజి కాశినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని