logo

వారంలో రెండు రోజులేఆయుష్‌....

జిల్లాలో ఆయుష్‌ విభాగంలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్యాధికారులు బదిలీ అయినా, ఉద్యోగ విరమణ చేసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. 2016-17కు ముందు వరకూ ఒక్కో డిస్పెన్షరీలో కనీసం 40కు పైగా ఓపీ ఉండేది.

Published : 20 Jan 2022 05:10 IST

జిల్లాలో దయనీయ స్థితిలో విభాగం

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆయుష్‌ విభాగంలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్యాధికారులు బదిలీ అయినా, ఉద్యోగ విరమణ చేసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. 2016-17కు ముందు వరకూ ఒక్కో డిస్పెన్షరీలో కనీసం 40కు పైగా ఓపీ ఉండేది. గడిచిన అయిదేళ్ల కాలంలో ఓపీ తగ్గుతోంది.

ఇదీ పరిస్థితి: జిల్లాలో ఆయుర్వేద విభాగంలో సేవలందించిన సీనియర్‌ వైద్యాధికారి రెండు నెలల కిందట ఉద్యోగోన్నతిపై విజయవాడకు బదిలీపై వెళ్లగా...అప్పటినుంచి ఈ విభాగం ఖాళీగా ఉంది. భీమవరం నుంచి డెప్యూటేషన్‌పై వైద్యాధికారిణిని నియమించారు. ఆమె సోమ, శనివారాల్లో మాత్రమే ఇక్కడికి వచ్చి సేవలందిస్తారు. మిగిలిన రోజుల్లో భీమవరంలో అందుబాటులో ఉంటారు. జిల్లాలోని మిగిలిన 41 డిస్పెన్షరీల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పీహెచ్‌సీలకు ఆనుకొనే ఉన్నాయి. చాలా వరకు వైద్యులు లేకపోవడంతో వారానికి రెండు, మూడు రోజులు డెప్యూటేషన్‌పై పంపించి సేవలందిస్తున్నారు. లేనిచోట కాంపౌండర్లే మందులిచ్చి పంపిస్తున్నారు.

ఖాళీల భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. డెప్యూటేషన్ల మీద సేవలందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. త్వరలో అన్ని విభాగాలకు వైద్యులు, సిబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల ఉన్నతాధికారులు నివేదిక అడిగారు. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. - శేఖర్‌, ప్రాంతీయ ఉప సంచాలకులు, ఆయుష్‌ విభాగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని