logo

విద్యతో పాటు ఉద్యోగావకాశాలు

జేఎన్‌టీయూ- గురజాడ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేఎన్‌టీయూ కళాశాల ప్రధానాచార్యులు జి.స్వామినాయుడు చెప్పారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన విలేకర్ల

Published : 20 Jan 2022 05:10 IST

మాట్లాడుతున్న స్వామినాయుడు

విద్యావిభాగం, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ- గురజాడ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేఎన్‌టీయూ కళాశాల ప్రధానాచార్యులు జి.స్వామినాయుడు చెప్పారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద కంపెనీలు రానుండడంతో సగటు ప్యాకేజీ పెరిగే అవకాశముందన్నారు. ఉపకులపతితో పాటు అవసరమైన బోధకులు, సిబ్బంది నియామకం జరిగి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ఈసీఈ విభాగాధిపతి కోట చంద్రభూషణరావు, ఈసీసీ, ఐటీ, సీఎస్‌ఈ ఆచార్యులు బాబులు, జి.జయసుమ, డి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని