logo

అటవీ అధికారుల ఔదార్యం

ఇటీవల ఏనుగుల దాడిలో ట్రాకర్‌ నిమ్మక రాజబాబు మరణించడం అటవీ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపిందని జిల్లా అటవీశాఖాధికారి ఎస్‌.వెంకటేష్‌ అన్నారు. బుధవారం విజయనగరంలో జరిగిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అటవీ అధికారుల సమీక్షలో

Published : 20 Jan 2022 05:10 IST

నగదు అందిస్తున్న డీఎఫ్‌వో వెంకటేష్‌

కొమరాడ, న్యూస్‌టుడే: ఇటీవల ఏనుగుల దాడిలో ట్రాకర్‌ నిమ్మక రాజబాబు మరణించడం అటవీ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపిందని జిల్లా అటవీశాఖాధికారి ఎస్‌.వెంకటేష్‌ అన్నారు. బుధవారం విజయనగరంలో జరిగిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అటవీ అధికారుల సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్వతీపురం, కురుపాం డివిజన్ల పరిధిలోని అధికారులు, సిబ్బంది సేకరించిన రూ.70 వేల విరాళాన్ని బాధిత కుటుంబానికి అందించారు. పార్వతీపురం సబ్‌ డీఎఫ్‌వో రాజారావు, రేంజ్‌ అధికారి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని