logo

ఉప్పొంగిన తాటిపూడి

జిల్లాలో ప్రధానమైన తాటిపూడి జలాశయం ఉప్పొంగింది. కనుచూపు మేరలో ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. సమీపంలోని గిరివినాయక ఎకోటూరిజం కేంద్రం అంచు వరకు చేరింది. పల్లపుప్రాంతంలో అలల హోరుకు నీరు రహదారిపైకి వస్తోంది. ఈ జలాశయం

Published : 20 Jan 2022 05:10 IST

ఎకోటూరిజం కేంద్రాన్ని తాకిన జలాశయం నీరు

తాటిపూడి(గంట్యాడ), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రధానమైన తాటిపూడి జలాశయం ఉప్పొంగింది. కనుచూపు మేరలో ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. సమీపంలోని గిరివినాయక ఎకోటూరిజం కేంద్రం అంచు వరకు చేరింది. పల్లపుప్రాంతంలో అలల హోరుకు నీరు రహదారిపైకి వస్తోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా, ప్రస్తుతం 296.6 అడుగులకు చేరింది. కొన్ని రోజులుగా గేట్లు ఎత్తకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకే ఎగువ నుంచి వరదనీరు రావడంతో ఈస్థాయికి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సమీపంలోని దిగువకొండపర్తి గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. తాగు, సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నీటిమట్టాన్ని నిలకడగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండడంతో సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు ఏఈ అపర్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని