logo

చక్కగా.. చదివేయండి

ప్రస్తుతం ఎక్కడ చూసినా చరవాణులు.. కంప్యూటర్లు.. సామాజిక మాధ్యమాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పటిలా గంటలకొద్దీ పుస్తకాలు చదివేవారు కనిపించడం లేదు. పుస్తకాల పురుగు అనే మాటే వినిపించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యాశాఖ

Published : 20 Jan 2022 05:10 IST

పిరిడిలో పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఎక్కడ చూసినా చరవాణులు.. కంప్యూటర్లు.. సామాజిక మాధ్యమాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పటిలా గంటలకొద్దీ పుస్తకాలు చదివేవారు కనిపించడం లేదు. పుస్తకాల పురుగు అనే మాటే వినిపించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యాశాఖ రంగంలోకి దిగింది. ‘బాలవాటిక’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలను అందుబాటులో ఉంచి, చదివించేందుకు 100 రోజుల ప్రణాళికను రూపొందించింది.

ప్రాథమిక స్థాయి నుంచి చిన్నారుల్లో పఠన నైపుణ్యం పెంపొందించడం దీని ఉద్దేశం. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్తంగా ఈ ప్రక్రియకు రూపకల్పన చేశాయి. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నారు. 1, 2 తరగతుల వారిని ఒక గ్రూపుగా, 3, 4, 5 తరగతుల విద్యార్థులను మరో గ్రూపుగా, 6, 7, 8 చదువుతున్న వారిని ఒక యూనిట్‌గా తీసుకుని చదివిస్తారు. ఇందుకోసం రిసోర్సు పర్సర్లను నియమించారు. రోజూ రెండు పీరియడ్లను కేటాయించారు. ఉపాధ్యాయులతో కూడిన గ్రంథాలయ, తల్లిదండ్రుల కమిటీను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. జిల్లాలోని 2,831 పాఠశాలల్లో, 1.80 లక్షల మందితో పుస్తక పఠనం చేయించనున్నారు.

మెటీరియల్‌ అందజేత..

కొన్ని పాఠశాలల్లో ఈనెల 6 నుంచి ప్రక్రియను ప్రారంభించాం. మరికొన్ని రోజుల్లో అన్నిచోట్లా ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ వరకు కొనసాగుతుంది. అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతాం. రిసోర్సు పర్సన్లతో పాటు, ఉపాధ్యాయులు కూడా అవగాహన కల్పిస్తారు. పీడీఎఫ్‌ ద్వారా ఆయా పాఠశాలలకు అవసరమైన మెటీరియల్‌ అందించాం. - శ్రీనివాసరావు, సెక్టోరియల్‌ అధికారి, సమగ్రశిక్ష, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని