logo

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడి ముందస్తు అరెస్టు

జిల్లాలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగార ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బలిజిపేట పోలీసులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణను గురువారం

Updated : 20 Jan 2022 18:13 IST

బలిజిపేట : జిల్లాలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగార ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బలిజిపేట పోలీసులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణను గురువారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. నారాయణపురం గ్రామంలోని తన స్వగ్రామం నుంచి బలిజిపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతోకాలంగా చెరకు రైతులకు యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తోందని, ఈ అంశంపై అధికారులు, పోలీసులు దృష్టి సారించకుండా శాంతియుత పోరాటం చేసేందుకు వెళ్తున్న రైతు, సీపీఎం నాయకులను, రైతులను ముందస్తు అరెస్టు చేయడం అన్యాయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని