logo

కల్లాల్లోనే ధాన్యం నిల్వలు

మండలంలో 20 చోట్ల వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ.. సంచులు, సామగ్రి అందుబాటులో లేకపోవడంతో రైతులు

Updated : 20 Jan 2022 18:14 IST

బలిజిపేట: మండలంలో 20 చోట్ల వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ.. సంచులు, సామగ్రి అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడికి తరలించాలో తెలియక ఎక్కువ మంది రైతులు బస్తాల్లో ఎక్కించి ధాన్యాన్ని కల్లాల్లోనే నిల్వ చేశారు. అధికారులు చొరవ చూపించి వీటిని వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైసుమిల్లులకు తరలించాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. ఈ అంశంపై పౌరసరఫరాలశాఖ ఉప తహసీల్దారు రమేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఈ కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని