logo

పోలమాంబ జాతరకు సర్వం సిద్ధం

ఈ నెల 24 నుంచి జరగనున్న ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అమ్మవారి చదురు, వనంగుడి వద్ద ఉచిత, రూ.10, రూ.50 దర్శనాల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గతంలో కంటే భిన్నంగా భక్తులు ఎండ, వానకు ఇబ్బంది పడకుండా పైకప్పు

Published : 22 Jan 2022 05:45 IST

క్యూలైన్లు

మక్కువ, న్యూస్‌టుడే: ఈ నెల 24 నుంచి జరగనున్న ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అమ్మవారి చదురు, వనంగుడి వద్ద ఉచిత, రూ.10, రూ.50 దర్శనాల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గతంలో కంటే భిన్నంగా భక్తులు ఎండ, వానకు ఇబ్బంది పడకుండా పైకప్పు వేశారు. రెండు ఆలయాల వద్ద 12 మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ఆదేశాల మేరకు మరో 10 నిర్మిస్తున్నారు. బొబ్బిలి-మక్కువ రహదారి మరమ్మతులు చేపట్టారు. సాలూరు, సీతానగరం రోడ్లపై గోతుల్ని తారుతో పూడుస్తున్నారు. ఉచిత ప్రసాదం, లడ్డూల తయారీ ఆర్బీకే వద్ద ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు