logo

ఉత్తమ ఏరువాక కేంద్రంగా గుర్తింపు

విజయనగరం ఏరువాక కేంద్రం వరుసగా రెండో ఏడాది ఉత్తమ కేంద్రంగా రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. రైతులకు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు అందిస్తూ.. సకాలంలో వ్యవసాయ, సాగు సమాచారం చేరవేయడం.. విపత్తులు ఏర్పడినప్పుడు తగిన తోడ్పాటు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని

Published : 22 Jan 2022 05:45 IST


అవార్డు అందుకుంటున్న ఏరువాక కేంద్రం సమన్వయకర్త లక్ష్మణ్‌

కలెక్టరేట్‌/వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: విజయనగరం ఏరువాక కేంద్రం వరుసగా రెండో ఏడాది ఉత్తమ కేంద్రంగా రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. రైతులకు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు అందిస్తూ.. సకాలంలో వ్యవసాయ, సాగు సమాచారం చేరవేయడం.. విపత్తులు ఏర్పడినప్పుడు తగిన తోడ్పాటు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం.. తదితర అంశాల్లో చేస్తున్న కృషికి గుర్తింపు దక్కింది. చిరుధాన్యాలపై పరిశోధనలు, సాగు విస్తీర్ణం పెంపు, గిరిజన ఉపప్రణాళిక ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో తోడ్పాటును అందించినందుకు గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానం సైతం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన స్థానంగా వరుసగా రెండోసారి అవార్డు దక్కించుకుంది. శుక్రవారం గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త కెల్ల లక్ష్మణ్‌, వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త పాత్రో అవార్డులు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని