logo

మూడేళ్లలో మ్యాపింగ్‌ పూర్తి

రాబోయే మూడేళ్లలో మూడు కిలోమీటర్ల పరిధిలోని 3, 4, 5 తరగతుల విలీనానికి సంబంధించిన మ్యాపింగ్‌ను పూర్తిచేయాలని నూతన జాతీయ విద్యావిధానం జిల్లా పరిశీలకురాలు జి.నాగమణి ఆదేశించారు. శుక్రవారం నగరంలోని ఫోర్టుసిటీ పాఠశాలలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో

Published : 22 Jan 2022 05:45 IST


మాట్లాడుతున్న నాగమణి

విద్యావిభాగం: రాబోయే మూడేళ్లలో మూడు కిలోమీటర్ల పరిధిలోని 3, 4, 5 తరగతుల విలీనానికి సంబంధించిన మ్యాపింగ్‌ను పూర్తిచేయాలని నూతన జాతీయ విద్యావిధానం జిల్లా పరిశీలకురాలు జి.నాగమణి ఆదేశించారు. శుక్రవారం నగరంలోని ఫోర్టుసిటీ పాఠశాలలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో సమావేశమై తరగతుల విలీనంపై చర్చించారు. సిబ్బంది, వసతి అంశాలపై లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేశారు. ఇన్‌ఛార్జి డీఈవో బ్రహ్మాజీరావు, విద్యాశాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని