logo

సైనికుల త్యాగాలు.. మదిలో మెదిలేలా

దేశానికి ఎనలేని సేవలందించి, అశువులు బాసిన జవాన్లు ఎందరో ఉన్నారు. జిల్లాకు చెందిన ఇలాంటి వారిని స్థానికులకు గుర్తుచేసేలా సైనిక సంక్షేమశాఖ జిల్లా అధికారి మజ్జి కృష్ణారావు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సొంత నిధులు రూ.5 లక్షలతో నగరంలోని సంక్షేమ బోర్డు కార్యాలయ

Published : 22 Jan 2022 05:45 IST


యుద్ధస్థూపం నమూనా

మయూరికూడలి, న్యూస్‌టుడే: దేశానికి ఎనలేని సేవలందించి, అశువులు బాసిన జవాన్లు ఎందరో ఉన్నారు. జిల్లాకు చెందిన ఇలాంటి వారిని స్థానికులకు గుర్తుచేసేలా సైనిక సంక్షేమశాఖ జిల్లా అధికారి మజ్జి కృష్ణారావు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సొంత నిధులు రూ.5 లక్షలతో నగరంలోని సంక్షేమ బోర్డు కార్యాలయ ప్రాంగణంలో యుద్ధస్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, అధికారిగా కాకుండా ఓ పౌరుడిగా ఈ పనులు చేయిస్తున్నట్లు ఆయన శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే పనులు పూర్తవుతాయని, దీన్ని అందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు స్థూపం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని