logo

విద్యార్థులకు శిక్షణ తరగతులు

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌(డిస్ట్రిక్ట్‌-302) ఆధ్వర్యంలో ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేసి పలు నైపుణ్య కోర్సులు అందించనున్నట్లు క్లబ్‌ అధ్యక్షురాలు ఎస్వీఎన్‌.జ్యోతి తెలిపారు. శుక్రవారం పూల్‌బాగ్‌కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలిదశలో పూల్‌బాగ్‌కాలనీ

Published : 22 Jan 2022 05:45 IST


ఎంపికైన విద్యార్థులతో క్లబ్‌ ప్రతినిధులు

మయూరికూడలి, న్యూస్‌టుడే: ఇన్నర్‌వీల్‌ క్లబ్‌(డిస్ట్రిక్ట్‌-302) ఆధ్వర్యంలో ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేసి పలు నైపుణ్య కోర్సులు అందించనున్నట్లు క్లబ్‌ అధ్యక్షురాలు ఎస్వీఎన్‌.జ్యోతి తెలిపారు. శుక్రవారం పూల్‌బాగ్‌కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలిదశలో పూల్‌బాగ్‌కాలనీ, డెంకాడలోని పెదతాడివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 20 మందిని ఎంపిక చేశామని, వీరికోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని