logo

ఇకనైనా.. అభివృద్ధి జరిగేనా?

పంచాయతీలకు అందిన ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లాలో 146 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. వీటికి జనాభా ప్రాతిపదికన రూ.8.75 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల సాధారణ

Published : 22 Jan 2022 05:45 IST

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: పంచాయతీలకు అందిన ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లాలో 146 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. వీటికి జనాభా ప్రాతిపదికన రూ.8.75 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల సాధారణ నిధులకు రెండు రోజుల్లో జమచేయనున్నారు. ఈ మేరకు ఖజానా అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సాధారణ నిబంధనలే..

సాధారణ నిధులకు వర్తించే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. గతంలో రోడ్లు, కల్వర్టులకు ఈ సొమ్మును ఉపయోగించేలా మార్గదర్శకాలున్నాయి. అయితే తాజాగా ఎలాంటి విధివిధానాలనూ ఖరారు చేయలేదు. దీంతో తమ ప్రాంతాలకు అవసరమైన పనులు చేసుకోవచ్చని సర్పంచులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్లిపోవడం, సాధారణ నిధులు పెద్దగా లేకపోవడంతో.. పంచాయతీలను ఈ డబ్బులు ఆదుకోనున్నాయి.

వీటికి అవకాశం లేదు..

చాలాచోట్ల హరిత రాయబారులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అద్దెలు, విద్యుత్తు బిల్లుల సమస్యలున్నాయి. అయితే ఈ నిధులను అలాంటి వాటికి ఖర్చుచేసేందుకు అవకాశం లేదని, ఉపాది పథకంలో వీటికి నిధులు కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు డీపీవో సుభాషిణి చెప్పారు.

జనాభా ఏకగ్రీవ పంచాయతీలు నిధులు (రూ.కోట్లలో)

2000 లోపు 120 6.00

2001-5000 23 2.30

5001-10,000 03 0.45

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని