logo

మరింత జాప్యం

విశాఖపట్నం- అరకు మార్గంలో పెందుర్తి- బౌడరా మధ్య పాడైన రోడ్డు పనులకు టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ రహదారి బాగుపడేందుకు మరికొంత సమయం పట్టనుంది. దీన్ని ఎన్‌హెచ్‌ 516బిగా విస్తరించే ముందు.. ప్రస్తుతం ఉన్న రోడ్డును పటిష్ట పర్చాలని అధికారులు నిర్ణయించారు

Published : 22 Jan 2022 05:45 IST


పాడైన విశాఖ- అరకు రహదారి

కొత్తవలస, న్యూస్‌టుడే: విశాఖపట్నం- అరకు మార్గంలో పెందుర్తి- బౌడరా మధ్య పాడైన రోడ్డు పనులకు టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ రహదారి బాగుపడేందుకు మరికొంత సమయం పట్టనుంది. దీన్ని ఎన్‌హెచ్‌ 516బిగా విస్తరించే ముందు.. ప్రస్తుతం ఉన్న రోడ్డును పటిష్ట పర్చాలని అధికారులు నిర్ణయించారు. మొదట పెందుర్తి నుంచి బౌడరా వరకు మెరుగు

పర్చడానికి రూ.20 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. ఇందులో పెందుర్తి నుంచి గోల్డ్‌స్టార్‌ కూడలి వరకు 18 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు మాత్రమే రూ.9 కోట్లు మంజూరైంది. ఇందుకు టెండర్లు పిలిచి గుత్తేదారు ఖరారైనా ఇంకా ఒప్పందం ప్రక్రియ పూర్తికాలేదు. దీనివల్ల ఫిబ్బవరిలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్యాచ్‌ వర్క్‌లకు కేటాయించిన రూ.60 లక్షలతో గోతులు కప్పి, బాగాపాడైన చోట తారుపొర వేశారు. ఇప్పుడు మరికొన్ని చోట్ల పాడైంది. ఈమార్గం పొడవునా గుంతలు ఏర్పడ్డంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారుతో ఒప్పందం పూర్తికాగానే పనులు చేయిస్తామని, తాజాగా గోల్డ్‌స్టార్‌ కూడలి నుంచి బౌడరా వరకు ప్యాచ్‌ వర్క్‌లకు రూ.60 లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపించామని, అనుమతి రాగా పనులు చేపడతామని ఎన్‌హెచ్‌ డీఈఈ నరసింహారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని