logo

75 శాతం రాయితీతో సమ్మిళిత పథకం అమలు

ఏపీఆర్‌ఐజీపీ(ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ సమ్మిళిత పథకం) కింద జిల్లాలో ఎంపికైన రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పీవో)లకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించనున్నట్లు డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు-ఉద్యాన శాఖాధికారులతో

Published : 22 Jan 2022 05:45 IST


మాట్లాడుతున్నఅశోక్‌కుమార్‌

మయూరికూడలి, న్యూస్‌టుడే: ఏపీఆర్‌ఐజీపీ(ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ సమ్మిళిత పథకం) కింద జిల్లాలో ఎంపికైన రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పీవో)లకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించనున్నట్లు డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు-ఉద్యాన శాఖాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద దత్తిరాజేరు, తెర్లాం, రామభద్రపురం, మెరకముడిదాం మండలాల్లో ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేశామని, ఇందులో భాగస్వాములైన రైతులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అధునాతన పంటలు, శీతలీకరణ కేంద్రాలు, మార్కెటింగ్‌, తరలింపు.. తదితరాలకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని ఇందులో 75 శాతం రాయితీ లభిస్తుందన్నారు. మిగతా 25 శాతం రుణం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని