logo

రహదారి భద్రతపై అవగాహన

ద్విచక్రవాహన చోదకులు, భారీవాహన చోదకులు రహదారి భద్రతపై తగు జాగ్రత్తలు పాటించాలని బలిజిపేట ఎస్సై పాపారావు, తపాలా శాఖ బొబ్బిలి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ

Updated : 22 Jan 2022 17:42 IST

బలిజిపేట: ద్విచక్రవాహన చోదకులు, భారీవాహన చోదకులు రహదారి భద్రతపై తగు జాగ్రత్తలు పాటించాలని బలిజిపేట ఎస్సై పాపారావు, తపాలా శాఖ బొబ్బిలి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ కోరారు. బలిజిపేట-బొబ్బిలి ప్రధాన రహదారిపై ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో శనివారం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులంతా తపాలాశాఖ పరిధిలో అమలు చేస్తున్న బీమా పథకాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. వాహన లైసెన్సులు, బీమా కలిగి ఉంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రహదారి మలుపుల వద్ద వాహనాలు జాగ్రత్తగా నడపాలని, ప్రమాద సూచికలున్న చోట మెల్లగా వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై పాణిగ్రహి, పోలీసులు, తపాలాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని