logo

అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి.

Published : 22 Jan 2022 16:54 IST

బలిజిపేట: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి. ఇందుకు బలిజిపేట-వంతరాం కూడలి నుంచి పెదపెంకి గ్రామం వరకు నిర్మించాల్సిన తారురోడ్డు శిలాఫలకమే నిదర్శనంగా మిగిలింది. ఈ పనులను పూర్తిచేసేందుకు రూ.కోటి 72లక్షల ఉపాధి నిధులకు ఎస్టిమేట్‌ వేయగా, గతేడాది మార్చి నెల 26న ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేశారు. నాటినుంచి నేటివరకు కేంద్రప్రభుత్వం ఈ పనులకు నిధులు మంజూరు చేయనందున శంకుస్థాపన వద్దే పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై పంచాయతీరాజ్‌శాఖ ప్రాజెక్టు డీఈఈ రమణ మోహన్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. బడ్జెట్‌ రానందున ఈ పనులు చేపట్టలేకపోయాయని, నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని