logo

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దిన వేడుకలను స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం జిల్లా ప్రజలకు కలెక్టర్‌ తన సందేశాన్ని వినిపిస్తారు.

Published : 26 Jan 2022 06:22 IST

 


ముస్తాబవుతున్న వేదిక

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దిన వేడుకలను స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం జిల్లా ప్రజలకు కలెక్టర్‌ తన సందేశాన్ని వినిపిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత శకటాల ప్రదర్శన ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. మంగళవారం ఆర్డీవో భవానీశంకర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే వేడుకలు తిలకించేలా స్థానిక ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.


సిద్ధమవుతున్న శకటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని