logo

ఓటీఎస్‌కు రుణ సాయం

ఓటీఎస్‌ కింద నగదు చెల్లించేవారికి అవసరమైన రుణ సాయాన్ని మెప్మా అందిస్తోంది. జిల్లాలోని నగరపాలిక, నగర పంచాయతీ, పురపాలికల్లోని 1863 మందికి గానూ ఇప్పటి వరకు రూ.3.04 కోట్ల రుణాన్ని అందించింది. బొబ్బిలిలో 613 మందికి, పార్వతీపురంలో 421, నెల్లిమర్లలో 48, సాలూరులో 276, విజ

Published : 26 Jan 2022 06:22 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ఓటీఎస్‌ కింద నగదు చెల్లించేవారికి అవసరమైన రుణ సాయాన్ని మెప్మా అందిస్తోంది. జిల్లాలోని నగరపాలిక, నగర పంచాయతీ, పురపాలికల్లోని 1863 మందికి గానూ ఇప్పటి వరకు రూ.3.04 కోట్ల రుణాన్ని అందించింది. బొబ్బిలిలో 613 మందికి, పార్వతీపురంలో 421, నెల్లిమర్లలో 48, సాలూరులో 276, విజయనగరంలో 505 మందికి రుణాలు ఇచ్చారు.

 

జిల్లా కేంద్రంలో...: విజయనగరంలో 13,786 మంది రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వారి ద్వారా రూ.12 కోట్ల వరకు ఓటీఎస్‌ వసూలవుతుందని భావించారు. వారిలో 2242 మంది వివరాలు మాత్రమే అప్‌లోడ్‌ చేయడంతో కేవలం 611 మంది నుంచి మాత్రమే రూ.1.18 కోట్లు రాబట్టగలిగారు. అవసరమైన వారికి రుణాలిచ్చి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

వివరాలిలా...: జిల్లాలోని నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మొత్తం 8,060 మంది లబ్ధిదారులుండగా, వారిలో స్వయం సహాయక సంఘాల్లో 6,859 మంది ఉన్నట్లు గుర్తించారు.

సహకరిస్తారు: ఓటీఎస్‌ చెల్లించడానికి పొదుపు సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, ఇతర రుణాలు ఇప్పించేందుకు సీఎంఎంలు, సీఓలు, ఆర్పీలు సహాయ సహకారాలు అందిస్తున్నారని మెప్మా పీడీ బి.సుధాకరరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని