logo

భూముల వేలం.. అయోమయం?

మండలంలోని చ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిల చెల్లింపులకు కర్మాగార భూముల వేలంపై అయోమయం నెలకొంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద సీతానగరం, బొబ్బిలి రెవెన్యూ

Published : 27 Jan 2022 05:50 IST

సీతానగరం, న్యూస్‌టుడే: మండలంలోని చ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిల చెల్లింపులకు కర్మాగార భూముల వేలంపై అయోమయం నెలకొంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద సీతానగరం, బొబ్బిలి రెవెన్యూ పరిధిలో ఉన్న 19.90 ఎకరాల భూమి అమ్మకానికి ఈనెల 18న ఐటీడీఏ సబ్‌ కలెక్టరు భావన ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. బకాయిలు, ఇతర ప్రభుత్వ రుసుములు కలిపి రూ.18 కోట్లు పైబడి ఉండటంతో అదే ధరను నిర్ణయించారు. అయితే మొత్తానికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 24న ఆన్‌లైన్‌లో జరిగిన జిల్లా వ్యవసాయ మండలి సమావేశం సందర్భంగా.. 27న మరోసారి వేలం నిర్వహిస్తున్నట్లు కలెక్టరు సూర్యకుమారి ప్రకటించారు. దీనిపై స్థానిక తహసీల్దార్లకు గానీ, రైతులకు గానీ ఎలాంటి సమాచారం అందలేదు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డీఆర్వో గణపతిరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని