logo

ఆర్టీవోనంటూ అక్రమ వసూళ్లు

ఆర్టీవో అధికారులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయంతి బుధవారం తెలిపారు. ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్‌ బ్రోకర్లుగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ఆర్టీవోగా, మనోజ్‌ అతని వాహన

Published : 27 Jan 2022 05:50 IST

పూసపాటిరేగ: ఆర్టీవో అధికారులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయంతి బుధవారం తెలిపారు. ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్‌ బ్రోకర్లుగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ఆర్టీవోగా, మనోజ్‌ అతని వాహన చోదకుడి అవతారమెత్తారు. చాలా రోజులుగా వాహన చోదకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బుధవారం కుమిలిలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణరావు, కానిస్టేబుల్‌ వాసు పట్టుకున్నారు. వారిన ుంచి సరైన సమాధానం రాకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. కారును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని