logo

పోలమాంబ పాహిమాం

గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ అంపకోత్సవం బుధవారం కనులపండువగా సాగింది. అమ్మవారి ఘటాల ఊరేగింపు అనంతరం నడిమివీధిలోని గద్దెపై వాటిని ఉంచి గిరడ, కరణం, నాయుడు, పూజారి కుటుంబికులతో పాటు భక్తులు పూజలు చేశారు.

Published : 27 Jan 2022 05:50 IST

ఘనంగా అంపకోత్సవం


అంపకోత్సవం

మక్కువ, న్యూస్‌టుడే: గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ అంపకోత్సవం బుధవారం కనులపండువగా సాగింది. అమ్మవారి ఘటాల ఊరేగింపు అనంతరం నడిమివీధిలోని గద్దెపై వాటిని ఉంచి గిరడ, కరణం, నాయుడు, పూజారి కుటుంబికులతో పాటు భక్తులు పూజలు చేశారు. అక్కడి నుంచి మేళతాళాలు, తప్పెట గుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారి పాలకావిడతో ఉయ్యాలకంబాల నిర్వహించారు. తర్వాత అంపకోత్సవంలో భాగంగా నూతన వస్త్రాలపై పాలకావిడతో నడుచుకుంటూ గోముఖి నదీ తీరానికి చేరుకున్నారు. అనంతరం అందరూ కలిసి వనంగుడికి పరుగులు తీసి అక్కడ అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పూడి దాలినాయుడు, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ఉప సర్పంచి అల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


ఉయ్యాల కంబాలలో పాల్గొన్న భక్తులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని