logo

కొత్త జిల్లాలతో అభివృద్ధి ఫలాలు

వికేంద్రీకరణ వల్లే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నది ముఖ్యమంత్రి ఆలోచనని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని

Published : 27 Jan 2022 05:50 IST

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: వికేంద్రీకరణ వల్లే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నది ముఖ్యమంత్రి ఆలోచనని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారన్నారు. బుధవారం తన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్వతీపురం ప్రాంతవాసుల చిరకాల కోరిక మేరకు ‘మన్యం’ జిల్లాను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌ చేయాలన్న ప్రతిపాదన గతంలోనే ఉందన్నారు. ప్రస్తుతం దీన్ని కూడా డివిజన్‌ చేయాలని మళ్లీ మంత్రి బొత్స ద్వారా ముఖ్యమంత్రికి ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.  

చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌ చేయాలి 
చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. బుధవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ గత 41 ఏళ్లుగా డివిజన్‌ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే విజయనగరం జిల్లా మధ్యలో చీపురుపల్లి ఉందని, దీని చుట్టు పక్కల మండలాలను కలిపి డివిజన్‌గా చేస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయన్నారు. విద్య, వైద్యంతో పాటు ఇతర రంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని