logo

ఉన్నతంగా నిలిచేందుకు చక్కని వేదిక

విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి అన్నారు. గురువారం ఆనందగజపతి కళాక్షేత్రంలో ‘మిషన్‌ నిర్మాణ్‌-2022’లో భాగంగా అయిదు రోజులు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 20 May 2022 04:24 IST


వేదికపై ప్రసంగిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి అన్నారు. గురువారం ఆనందగజపతి కళాక్షేత్రంలో ‘మిషన్‌ నిర్మాణ్‌-2022’లో భాగంగా అయిదు రోజులు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో కేంబ్రిడ్జ్‌ అసెస్‌మెంట్‌ ఆంగ్లం, ఏస్, 21 సెంచరీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సంయుక్తంగా శిక్షణ ఇవ్వనుంది. కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నతంగా నిలిచేందుకు ఇదో చక్కని వేదికని, పరీక్షలు ముగిసినందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు ఆంగ్లం ప్రాముఖ్యం, భవిష్యత్తు అవకాశాలను కేంబ్రిడ్జ్‌ కన్సల్టెంట్‌ భరత్‌ సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రజెంటర్‌ షీతల్‌ బందేకర్, సివిల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ మెంటార్‌ అనుకుల రాజ్‌కుమార్‌ వివరించారు. డీఈవో ఎ.ఎం.జయశ్రీ, సమగ్రశిక్ష అభియాన్‌ అదనపు పథకం సమన్వయకర్త వి.అప్పలస్వామినాయుడు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యుడు ఎన్‌.తిరుపతినాయుడు, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి టి.సన్యాసిరాజు, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు