logo

మ్యుటేషన్ల వివరాలు సమర్పించాలని ఆదేశాలు

విజయనగరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో 2020 ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది మే నెల వరకు జరిగిన మ్యుటేషన్ల వివరాలను రెండు రోజుల్లో అందించాలని తహసీల్దార్లను ఆర్డీవో భవానీశంకర్‌ ఆదేశించారు.

Published : 20 May 2022 04:24 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: విజయనగరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో 2020 ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది మే నెల వరకు జరిగిన మ్యుటేషన్ల వివరాలను రెండు రోజుల్లో అందించాలని తహసీల్దార్లను ఆర్డీవో భవానీశంకర్‌ ఆదేశించారు. మండలాల్లో అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీషియన్‌ డీడ్లతో అక్రమంగా మ్యుటేషన్లు చేస్తున్న వైనంపై బుధవారం ‘ఈనాడు’లో ‘దొడ్డిదారిన మ్యుటేషన్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ప్రాంతీయ విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంటు అధికారి కోరిన వివరాలు అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. దాదాపు రెండేళ్ల కాలంలో జరిగిన మ్యుటేషన్లు, అందులో రిజిస్టర్డు డీడ్‌లు, అన్‌ రిజిస్టర్డు డీడ్‌ల వివరాలు, విస్తీర్ణం, ఐడీలు, దరఖాస్తు చేసిన తేదీలు తదితరాలను సమగ్రంగా అందించాలన్నారు.

కార్యాలయాల్లో గందరగోళం: ఆర్డీవో ఆదేశాలతో తహసీల్దారు కార్యాలయాల్లో గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా 2020 నుంచి ఏడాదిన్నర పాటు (కరోనా సమయంలో) ఇష్టారాజ్యంగా మ్యుటేషన్లు జరిగాయి. ఇప్పుడు వీటిపై పరిశీలన జరిగితే గుట్టురట్టవుతుందని రెవెన్యూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్నిచోట్ల అన్‌రిజిస్టర్డు పార్టీషియన్‌ డీడ్‌ల్లో వారసుల సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు అందితే పెద్దఎత్తున అక్రమాలు బయటపడే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని