logo

నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

యువత విద్యతో పాటు ఉపాధినిచ్చే అంశాలను నేర్చుకోవాలని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి తేజస్వి కట్టమణి అన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై గురువారం విద్యాలయ ప్రాంగణంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌

Published : 20 May 2022 04:24 IST


ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఉప కులపతి, ఎన్‌ఏసీ సంచాలకుడు 

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: యువత విద్యతో పాటు ఉపాధినిచ్చే అంశాలను నేర్చుకోవాలని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి తేజస్వి కట్టమణి అన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై గురువారం విద్యాలయ ప్రాంగణంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఏసీ ఏపీ), కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కట్టమణి మాట్లాడుతూ ఏదో ఒక నైపుణ్యం లేకుండా ఉద్యోగాలు పొందడం కష్టమన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సీటీయూ ఉపకులపతి వ్యక్తిగత కార్యదర్శి సుప్రియా దాస్, పరిపాలనాధికారి ఎన్‌.వి.ఎస్‌.సూర్యనారాయణ, నైపుణ్యాభివృద్ధి ఇన్‌ఛార్జి పీవీపీఎస్‌ అరుణ్, నాక్‌ సంచాలకుడు ఇంద్రకిరణ్, ప్రాంతీయ సంచాలకుడు చిట్టిబాబు, సహాయ సంచాలకుడు రవి పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని