logo

పోరాడదాం.. తెదేపా జెండాను ఎగరేద్దాం

కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పోరాడదామని, వచ్చే ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగరేద్దామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన రాజాం పర్యటనకు రాగా.. శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి.

Published : 21 May 2022 04:27 IST

మీరు పెట్టిన కేసులు జింక ముందు ఫ్లూటు ఊదినట్లు ఉంది. తెదేపా కార్యకర్తలు సింహాల్లాంటి వారు. మూడేళ్లుగా ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలి. మీకు నేను అండగా ఉంటాను.రాజాంలో నారా లోకేశ్‌

ఈనాడు-విజయనగరం, రాజాం, న్యూస్‌టుడే:  కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పోరాడదామని, వచ్చే ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగరేద్దామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన రాజాం పర్యటనకు రాగా.. శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. రోడ్‌షోలో పూలవర్షం కురిపించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు ఇంటి నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా.. దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికారు. లోకేశ్‌ తన వాహనంపై నిలబడి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పార్టీ కార్యాలయం ఎదుట చేరికల కోసం వేదిక ఏర్పాటు చేయగా దానిపైకి చేరుకోవడానికి ఆయనకు సమయం పట్టింది. కార్యకర్తలు, అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. సంతకవిటి మండలంలోని బొద్దూరు, జీఎస్‌ పురం, తలతంపర, రంగరాయపురం, రేగిడి మండలం పారంపేట, పనసలవలస పంచాయతీలకు చెందిన పలువురు వైకాపా నాయకులు ఆయన సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా వేసి  ఆహ్వానించారు. 


నూతన వధూవరులతో లోకేశ్‌ 

ఇన్‌ఛార్జులకు దిశానిర్దేశం 
కళా వెంకటరావు నివాసంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. వచ్చే రెండేళ్లు చాలా కీలకమని, అంతా సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, కిమిడి నాగార్జున, కూన రవికుమార్, ఇన్‌ఛార్జులు కోండ్రు మురళీ, బేబినాయన, డి.జగదీష్, బి.చిరంజీవులు, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, టి.జగదీశ్వరి, తెంటు లక్ష్మునాయుడు, కె.ఎ.నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. 


ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులకు సూచనలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని