logo

మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు

మూగజీవాలు ఉన్న ప్రదేశంలోనే మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జడ్పీ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ పశు

Published : 21 May 2022 04:27 IST

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: మూగజీవాలు ఉన్న ప్రదేశంలోనే మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జడ్పీ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ పశు ఆరోగ్య సేవలో భాగంగా జిల్లాకు మంజూరైన ఏడు వాహనాలను ఆయన ప్రారంభించారు. రైతులు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని, దేశానికే ఇది ఆదర్శమన్నారు. వాహనంలో ఆధునిక ప్రయోగశాల సౌకర్యం కల్పించారని, అత్యవసర చికిత్సకు పశువుల్ని ఆసుపత్రులకు తరలించవచ్చన్నారు. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జడ్పీ సీఈవో రాజ్‌కుమార్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు వై.వి.రమణ, జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ జిల్లా సమన్వయకర్త బి.నారాయణరావు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని