logo

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తాం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎం.నాగార్జున అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నేషనల్‌ క్యాంపెయిన్‌ ఆన్‌ దళిత హ్యుమన్‌ రైట్స్‌- దళిత బహుజన శ్రామిక

Published : 23 May 2022 04:13 IST

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మంత్రి నాగార్జున, డీబీఎస్‌యూ రాష్ట్ర నాయకులు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎం.నాగార్జున అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నేషనల్‌ క్యాంపెయిన్‌ ఆన్‌ దళిత హ్యుమన్‌ రైట్స్‌- దళిత బహుజన శ్రామిక యూనియన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం గోడపత్రికలను విజయనగరంలో ఆయా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఈ చట్టం అమలుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. డీబీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, ప్రతినిధులు భానుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని