logo

కి.మీ. పరిధిలోనే.. 3,4,5 తరగతుల విలీనం

పాఠశాలల విలీనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తొలుత మూడు కి.మీ. పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారని భావించినా..ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2022-23 విద్యాసంవత్సరానికి

Published : 23 May 2022 04:13 IST

విలీన ప్రక్రియపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నిరసన

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాఠశాలల విలీనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తొలుత మూడు కి.మీ. పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారని భావించినా..ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2022-23 విద్యాసంవత్సరానికి కి.మీ. దూరంలో ఉన్న తరగతులనే కలపాలనే ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అధికారులు కసరత్తు ప్రారంభించారు.

సమీప బడుల్లో...: ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఏది అందుబాటులో ఉంటే అందులో కలుపుతారు. గతంలో మ్యాపింగ్‌ చేసిన మేరకు 421 పాఠశాలలు కి.మీ. పరిధిలో ఉన్నట్లు గుర్తించినప్పటికీ ఇందులో ఎన్నింటిని చేస్తారో ఇంకా తేల్చాల్సి ఉంది.

గతేడాది కసరత్తు..: విలీనానికి సంబంధించిన కసరత్తంతా గతేడాది చేశారు. 2021-22లో 250 మీటర్ల పరిధిలోని 143 పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న 136 ఉన్నత పాఠశాలల్లో కలిపారు. వసతి సమస్యతో కొన్ని పాఠశాలలు కాగితాల్లో కలిపేసినట్లున్నా...తరగతుల నిర్వహణ మాత్రం ఉన్న చోటే కొనసాగింది. 2022-23 ఏడాది నుంచి 3 కి.మీ. పరిధిలో 983 పాఠశాలలను దశలవారీగా కలిపేందుకు మ్యాపింగ్‌ చేశారు. వీటిలో 82 చోట్ల అనుకూలంగా లేదని, మిగిలిన 901 పాఠశాలలను విలీనానికి సిద్ధం చేశారు. ఇప్పుడు కి.మీ. పరిధిలో చేయాలనుకోవడంతో మార్పులు జరుగుతున్నాయి.

పాత జిల్లా ప్రాతిపదికనే..: జిల్లా విభజన కాకముందు 34 మండలాలున్నాయి. విభజన తర్వాత విజయనగరంలో 27, పార్వతీపురం మన్యంలో 15 మండలాలున్నాయి. పాత జిల్లాలో మండలాల ప్రాతిపదికనే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో రెండు జిల్లాల్లో అధికారులు గతంలో ఉన్న మండలాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

సరిపడా వసతి ఉంటేనే..: విలీనం చేసే పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులుండాలని స్పష్టం చేయడంతో ఫీజుబులిటీ ఉన్నవాటిని గుర్తిస్తున్నారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతరత్ర రూపాల్లో అదనంగా ఉన్న గదులను ముందుగా తరగతుల నిర్వహణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించడంతో ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండురోజుల్లో విలీనమయ్యే పాఠశాలల సంఖ్య కొలిక్కి రానుందని అధికారులు చెబుతుండగా... ఈ ప్రక్రియపై వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న దానిపై అంతటా చర్చ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని