logo

అక్కడలా.. ఇక్కడిలా

సాలూరులో వేగావతిపై 300 మీటర్ల దూరంలో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. పట్టణం నుంచి పాచిపెంట మండలం పాంచాలి, గురివినాయుడుపేటకు వెళ్లే దారిలో కాకులతోట వద్ద నదిలో వంతెన నిర్మాణానికి రూ.8.14 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను

Published : 23 May 2022 04:13 IST

రెండేళ్లుగా గోతుల్లోనే ఆర్‌అండ్‌బీ చేపట్టిన వంతెన

సాలూరులో వేగావతిపై 300 మీటర్ల దూరంలో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. పట్టణం నుంచి పాచిపెంట మండలం పాంచాలి, గురివినాయుడుపేటకు వెళ్లే దారిలో కాకులతోట వద్ద నదిలో వంతెన నిర్మాణానికి రూ.8.14 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను 2020 ఫిబ్రవరి 26న రహదారులు, భవనాల శాఖ ప్రారంభించగా.. ఇప్పటి వరకు స్తంభాలు కూడా వేయలేదు. దీనికి సమీపంలో ప్రత్యామ్నాయ రహదారి పనుల్లో భాగంగా మరో వంతెన నిర్మాణాన్ని గతేడాది ఎన్‌హెచ్‌ఐ చేపట్టింది. ఇది మరికొన్నిరోజుల్లో పూర్తికానుంది. ఆర్‌అండ్‌బీ చేపట్టిన పనులు కనీసం 30 శాతం కూడా జరగకపోగా గుత్తేదారుకు రూ.92 లక్షల వరకు బిల్లుల బకాయిలున్నాయి. తుపాన్ల కారణంగా నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయిందని, అక్టోబరు లోపు పూర్తిచేస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈ విజయ్‌కుమార్‌ తెలిపారు.- న్యూస్‌టుడే, సాలూరు

పూర్తి కావస్తున్న బైపాస్‌ రోడ్డు పనులు​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని